జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు: ‘గేమ్ ఛేంజ‌ర్’ స‌ర్వే



▪️ కాంగ్రెస్‌కు 42% నుంచి 46% ఓట్లు
▪️ బీఆర్ఎస్‌కు 34% – 38% ఓట్లు
▪️ బీజేపీకి 12% – 16% ఓట్లు
▪️ ఇత‌రుల‌కు 04% – 08% ఓట్లు
▪️ తేల్చిన ‘గేమ్ ఛేంజ‌ర్’ స‌ర్వే రిపోర్ట్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ సంస్థ‌ ‘గేమ్ ఛేంజ‌ర్ – మీడియా బాస్ నెట్‌వ‌ర్క్’ నిర్వహించిన సర్వే ఫలితాలు స్ప‌ష్టం చేశాయి. కాంగ్రెస్‌కు 42% నుంచి 46% ఓట్లు ప‌డే అవకాశం ఉందని స‌ర్వే అంచనా వేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 34% – 38% ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 12% – 16% ఓట్లు ప‌డే అవకాశం ఉందని ఈ స‌ర్వే రిపోర్టు తేల్చింది. స‌ర్వే ప్ర‌కారం ఇత‌రులకు 04% – 08% ఓట్లు షేర్ అవుతాయి.

‘గేమ్ ఛేంజ‌ర్ – మీడియా బాస్ నెట్‌వ‌ర్క్’ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, “ఈ సర్వేలో ఓటర్ల అభిప్రాయాలు అత్యంత లోతుగా సేకరించాము. ఈ స‌ర్వేలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు, రాజ‌కీయ విశ్లేష‌కులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని అన్ని ప్రాంతాలు, వివిధ వృత్తి వర్గాల నుంచి డేటాను పరిగణనలోకి తీసుకున్నాము. ఫలితాలు ఎన్నికల దిశను సూచిస్తున్నాయి” అని తెలిపారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించిన ఈ సర్వేలో 6,200 మంది ఓటర్ల అభిప్రాయాల తీసుకున్న‌ట్టు చెప్పారు.

Survey Report On Jubilee Hills By Election – Media Boss Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *