RRR లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. అలాగే సౌతిండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఫస్ట్ తెలుగు మూవీ. అన్నింటికీ మించి 350 కోట్లకు పైగా బడ్జెట్‌తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రామ్ నందన్ (రామ్ చరణ్) కలెక్టర్. ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు. తన పరిధిలో ఏ తప్పు జరిగినా ఒప్పుకోడు. అలాంటి ఐఏఎస్ వైజాగ్ వచ్చిన తర్వాత సిటీని క్లీన్ చేసే పనిలో పడతాడు. అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) కొడుకు బొబ్బిలి మోపిదేవి (sj సూర్య)తో అనుకోని శత్రుత్వం ఏర్పడుతుంది. తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు మోపిదేవి. అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు. ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. ఇదే సమయంలో తన తండ్రి అప్పన్న (రామ్ చరణ్) గురించి.. అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు రామ్ జీవితంలోకి దీపిక (కియారా అద్వానీ) ఎలా వచ్చింది..? అనేది మిగిలిన కథ
నటీనటులు:
అప్పన్నగా .. రామ్‌నందన్‌గా రామ్‌చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్స్‌లోనూ చెర్రీ నటన సినిమాకే హైలైట్. ముఖ్యంగా అప్పన్న పాత్రలో ఆయన నటన సూపర్. కియారా అద్వానిది రెగ్యులర్ హీరోయిన్ పాత్రనే. నటనకు పెద్దగా స్కోప్ లేదు. అంజలికి చాలా కాలం తరువాత నటనకి ఆస్కారమున్న పాత్ర. తన పాత్రకు న్యాయం చేసింది. అప్పన భార్యగా పార్వతిగా ఆమెకు మంచి మార్కులు పడతాయి. ఎస్‌జే సూర్య యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యే విధంగా ఉంది. మోపిదేవి పాత్రలో ప్రతినాయకుడిగా భయపెట్టడంతో పాటు అక్కడక్కడా నవ్వించాడు. సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్ పాత్రలు పరవాలేదు.
సాంకేతికత :
చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టోరీని స్పీడ్‌గా నడవడంలో సహాయపడింది. పాటల్లో విజువల్స్ బాగున్నాయి. కళా దర్శకత్వం, ఎడిటింగ్ పనితీరు మెచ్చుకునే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం రైటింగ్ సైడ్ శ్రద్దపెట్టి, ఇంకాస్త బలమైన సన్నివేశాలు రాసుకుని ఉంటే బాగుండేది. ఓ సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటప్పుడు రచన విభాగంలో చేయాల్సిన స్థాయిలో కసరత్తులు జరగలేదనిపిస్తుంది.
సినిమా కథ సాధారణంగా ఉన్నప్పటికీ ఒక పొలిటికల్ డ్రామాను కచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయడంలో శంకర్ అక్కడ తడబడినప్పటికీ ఓవరాల్ గా సినిమా మొత్తంలో సక్సెస్ చేయడమే చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటువంటి కథలు కాస్త అటు ఇటుగా వచ్చినప్పటికీ ఈ సినిమాలో ముందుగా మనం చూడవలసింది డైరెక్షన్ ఇంకా స్క్రీన్ ప్లే. డబ్బింగ్ కూడా బాగానే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ లో కొంచెం లెగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగా ఉంది.
ఓవరాల్ గా గేమ్ ఛేంజర్.. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్. ఈ పండక్కి చూడదగిన ఎంటర్‌టైనర్!
Rating : 3.25 / 5