సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశంతాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రముఖ పంచాంగకర్తలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శాస్త్ర పరమైన విషయాలను సజ్జల రామకృష్ణా రెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. పంచాంగ గణితంలోని తేడాలు వారు వివరించారు. దృక్ సిద్ధాంత పంచాంగ వాస్తవ పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో ఈ పంచాంగం ప్రాచుర్యం. తెలుగు రాష్ట్రాల్లో పండుగ తేదీలలో సందిగ్ధతకు కారణాలు మొదలైన అన్ని విషయాల్లో కావాల్సిన ఆధారాలతో కూడిన రిప్రజెంటేషన్ అందచేయటం జరిగింది. ఖచ్చితంగా ధర్మ బద్ధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల చైత్ర పక్ష దృక్ సిద్ధాంత పంచాంగకర్తల సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడు డా.అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి, సమాఖ్య కన్వీనర్ psr కృష్ణ, సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గొర్తి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.