పేద‌ల దేవుడు వైఎస్సార్: తోటకూర వజ్రేష్ యాదవ్



హైద‌రాబాద్ (మేడ్చ‌ల్): పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆరోగ్యశ్రీ, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్‌మెంట్ వంటి పథకాలను ఏర్పాటు చేసిన గొప్పనేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కొనియాడారు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడ్ల ముత్యాలు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, డాక్టర్ అవ్వాలనే నిరుపేదల కోరికలను నిజం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్, భాను ప్రకాష్, ఆంజనేయులు యాదవ్,ఘట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జవహర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్,మూడు చింతలపల్లి మండల్ అధ్యక్షులు నర్సింహా యాదవ్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్, కీసర మండల్ అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ S.C సెల్ అధ్యక్షులు కుర్రి మహేష్, ఘట్కేసర్ మండల్ ప్రధాన కార్యదర్శి బాబు రావు గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ యూత్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, ఘట్కేసర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్,కౌన్సిలర్ చాపరాజు ముదిరాజ్, చౌదరిగుడా గ్రామ అధ్యక్షులు కట్ట ఆంజనేయులు గౌడ్, పోచారం మున్సిపాలిటీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజు మాధవి,పోచారం మున్సిపాలిటీ S.C సెల్ అధ్యక్షులు రాజు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ S.C సెల్ అధ్యక్షులు నవీన్, సతి రెడ్డి, నర్సింగ్ రావు, సురేష్ గౌడ్, మేకల సునీల్, కార్తీక్ యాదవ్, అశోక్, అశోక్, రాజు యాదవ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *