హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన లగ్జరీ స్పోర్ట్స్ కారును జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ నడిపినట్లు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదంపై సంజుష్ తన వివరణను వెల్లడించారు. ప్రమాదం జరిగిన అనంతరం తాను ఘటనా స్థలం నుంచి పారిపోలేదని […]
